ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రజలు ఎవరూ ఊహించని అనూహ్యమైన తీర్పు ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం వైసీపీ 134 స్థానాల్లో, టీడీపీ 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మంత్రులుగా పనిచేసిన నారా లోకేశ్, అఖిలప్రియ, నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అయ్యన్నపాత్రుడు, చిన రాజప్ప, అమర్‌నాథ్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర వెనుకంజలో ఉన్నారు.
కృష్ణా జిల్లా మైలవరం నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు, తిరువూరు నుంచి జవహర్, చిలకలూరిపేట నుంచి ప్రత్తపాటి పుల్లారావు ముందంజలో ఉన్నారు. మంగళగిరి నుంచి పోటీ పడిన నారా లోకేశ్ తొలి రౌండ్ లో స్వల్ప ఆధిక్యాన్ని చూపించినప్పటికీ ఆ తర్వాత వెనుకబడిపోయారు