ఐపీఎల్ లో అద్భుతంగా రాణించి ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్‌లోని సెకండ్ మ్యాచ్ తో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే అరంగేట్ర మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్ మెరుపు హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. సూర్యకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక మూడో టీ20కి ఓపెనర్ రోహిత్ శర్మ అందుబాటులోకి రావడంతో వరుసగా విఫలమవుతున్న కేఎల్ రాహుల్‌ను తప్పిస్తారని అంతా భావించారు. కానీ రాహుల్‌కు అండగా నిలిచిన టీమ్‌మేనేజ్‌మెంట్ సూర్యపై వేటు వేసింది. అయితే అవకాశం ఇవ్వకుండానే సూర్యను తప్పించడంపై అటు అభిమానులు, ఇటు మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సూర్యపై వేటు వేయడాన్ని గంభీర్ తప్పుబట్టాడు. అతనికి సరైన అవకాశం ఇవ్వకుండానే ఎలా తప్పిస్తారని సూటిగా ప్రశ్నించాడు. అతనికి బదులు ఇంకెవరినైనా పక్కకు పెట్టాల్సిందన్నాడు. అతని 3-4 మ్యాచ్‌లు అవకాశం ఇచ్చిన తర్వాత ఓ నిర్ణయంకు రావాలని టీమ్‌మేనేజ్‌మెంట్‌ను కోరాడు. మరో ఏడు నెలల్లో టీ20 ప్రపంచకప్ ఉంది. ఈ సందర్భంలో ఇలాంటి నిర్ణయాలు సరైనవి కావు. సూర్యకుమార్‌కు ఎలాంటి గాయాలు లేవు. అతని బ్యాటింగ్ తీరు చూసిందీ లేదు. మరి అలాంటపుడు అతడిని ఎలా పక్కకు పెడతారు అని ఈ మాజీ భారత ఓపెనర్ తన అసహనం వ్యక్తం చేశాడు.
previous post
next post

