telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కేసీఆర్ నుంచి అనేక దుర్మార్గులు నేర్చుకోవచ్చు…

revanthreddy campaign in huzurnagar

కేసీఆర్ నుంచి అనేక దుర్మార్గులు నేర్చుకోవచ్చని, చనిపోయిన ‌కుటుంబాలకే ఏకగ్రీవంగా చేసే సంప్రదాయాన్ని కేసీఆర్  తుంగలో తొక్కి ఎన్నికలకు తేరలేపాడని అన్నారు రేవంత్ రెడ్డి . ఎమ్మెల్యేలు కృష్ణా రెడ్డి ,రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి లు చనిపోతే ఏకగ్రీవం కాకుండా …ఎలక్షన్ లను కలెక్షన్ లుగా మార్చి సెలక్షన్ చేయడం కేసీఆర్ ‌నాంది పలికాడని అన్నారు. మరీ ఇదే నాగార్జున సాగర్ లో‌ఎందుకు నోముల భగత్ కోసం  సానుభూతి ఓట్లను అడుగుతున్నారని అన్నారు. కమ్యూనిస్టు లో‌ ఉన్నపుడు నోముల నర్సింహయ్య గారు అన్ని రంగాల కార్మికుల సమస్యలను అసెంబ్లీ లో‌గళం వినిపించారని, 2014 లో నాగార్జున సాగర్ లో ఎమ్మెల్యే గా నోముల నర్సింహయ్య ఓడిపోతే ఎందుకు పదవి ఇవ్వలేదు ? అని ప్రశ్నించారు.  నోముల నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా గెలిచాక ఏనడైనా సీఎం వచ్చిండా అని ప్రశ్నించారు. నోముల నర్సింహయ్య బ్రతికి ఉండగా మంత్రి‌ పదవి ఎందుకు ఇవ్వలేదు ? అలుగడ్డలు టమాటోలు అమ్మేవాళ్లకు మంత్రి పదవి ఇచ్చాడని అన్నారు.

Related posts