telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

చంద్రబాబుతో పాటు మరో కీలక నేతకు నోటీసులు

chandrababu tdp ap

టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణలపై సీఐడీ కేసులు నమోదు చేసింది. ఏపీ సీఆర్డీఏ చైర్మన్ హోదాలో అసైన్డ్ భూముల బదలాయింపు వ్యవహారంలో మాజీ సీఎం చంద్రబాబు పై సీఐడీ కేసు నమోదు అయింది. కేబినెట్ ఆమోదం లేకుండానే అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ లో చేర్చడంపై సీఐడీ కేసులు నమోదు చేసింది. దళితులకు కేటాయించిన భూములు రాజధాని ప్రకటనకు ముందు ఇతరుల కొనుగోలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. భూ సమీకరణ ప్రకటించిన తర్వాత వాటిని కాబినెట్ అనుమతి లేకుండానే బదలాయింపు కి అనుమతించింది చంద్రబాబు ప్రభుత్వం. దాదాపు 500ఎకరాల అసైన్డ్ భూముల కొనుగోళ్ళను వన్ టైమ్ సెటిల్మెంట్ లో క్రమబద్దీకరించారు. అధికారుల అభ్యంతరాలు, సూచనలు పట్టించుకోకుండా చైర్మన్ హోదాలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. 41crpc కింద విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు.

Related posts