telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

మహిళలకు గుడ్‌ న్యూస్‌ : భారీగా పడిపోయిన బంగారం ధరలు

బులియన్‌ మార్కెట్‌లో గత నాలుగు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు యథాతథంగా ఉన్నాయి. దేశ రాజధానితో పాటు హైదరాబాద్‌లోనూ వెండి ధర భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ లలో బంగారం ధర గత నాలుగు రోజులుగా స్థిరంగా ఉంది. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 380 తగ్గి రూ. 49,690 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 తగ్గి రూ. 45,550 వద్ద ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గిపోయాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 380 తగ్గి రూ. 47,350 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 తగ్గి రూ. 43,400 పలుకుతోంది. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుంటే, వెండి ధరలు మాత్రం షాకిచ్చాయి. కిలో వెండి ధర మార్కెట్లో ఏకంగా రూ. 700 పెరిగింది. కిలో వెండి ధర ప్రస్తుతం మార్కెట్లో రూ. 74, 300 వద్ద ఉన్నది.

Related posts