telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

టక్ జగదీష్ నుండి విడుదలైన లిరికల్ సాంగ్…

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు అందరూ వరుస సినిమాలు చేస్తున్నారు. అందులో నాచురల్ స్టార్ నాని కూడా ఒక్కడు. ప్రస్తుతం నాని వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. టక్ జగదీష్, అంటే సుందరానికి, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో పాటు ఈ ఏడాది చివరికి ఓ వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నారంట. ప్రస్తుతం నాచురల్ స్టార్ తన తాజా చిత్రం టక్ జగదీష్ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శివ నిర్వానా దర్శకత్వంలో సాహు గారిపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇతర సినిమాల వారు వరుసగా లిరికల్ పాటలు విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో తాజాగా నాని కూడా చేరారు. నాని టక్ జగదీష్ సినిమా నుంచి ఇంకోసారి ఇంకోసారి అంటూ సాగే పాట తాజగా విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాట రొమాంటిక్‌గా ఉంది. అయితే ఈ సినిమాకు త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్‌ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా పై అభిమానులకు భారీ నాచనలు ఉన్నాయి. చూడాలి మరి టక్ జగదీష్ ఆ అంచనాలను అందుకుంటాడా… లేదా అనేది.

Related posts