ప్రస్తుతం ఏపీలో లోకల్ ఎన్నికలు దగరపడుతుండటంతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఎన్నికలను సజావుగా జరిగేలా చూడాలని సూచనలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. నెల్లూరులోని జెడ్పి హాల్లో పంచాయతీ ఎన్నికలపై అధికారులతో సమీక్షను నిర్వహించారు. కరోనా కేసులు అదుపులోకి రావడం సంతోషించదగిన విషయంగా చెప్పారు. సరైన సమయంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. తన పరిధిని దాటి ఏ రోజు ప్రవర్తించలేదని అన్నారు. ఇక సాధారణ ఏకగ్రీవాలను తాను తప్పుబట్టడం లేదని, బలవంతపు ఏకగ్రీవాలు ఉంటె వాటిపై నిఘా ఉంటుందని అన్నారు. ఎన్నికలను పటిష్టంగా జరపాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. చూడాలి మరి ఈ ఎన్నికలో ఏం జరుగుతుంది అనేది.
previous post
next post
చంద్రబాబు నివాసం చుట్టూ మంత్రుల చక్కర్లు: అచ్చెన్నాయుడు