telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత..

సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ తొలగిస్తూ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఉత్తర్వులు ఇచ్చారు.

తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు జీఏడీలో రిపోర్టు చేయాలని సూచించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఇటీవల చీఫ్ సెక్రటరీని కలిసి ఏబీ వెంకటేశ్వరరావు రిపోర్టు చేశారు.

సుప్రీంకోర్టు ఉత్తర్వుల అమలుకు పలుమార్లు సీఎస్ ను వెంకటేశ్వర రావు స్వయంగా కలిశారు. 2022 ఫిబ్రవరి 8 నుంచి ఆయనను సర్వీస్ లోకి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే తనను సస్పెన్షన్లో ఉంచిన రోజు నుంచి సర్వీస్‌లోకి తీసుకోవాలని, రెండేళ్ల సస్పెన్షన్ కాలాన్ని కూడా సర్వీస్‌లోకి తీసుకోవాలని కోర్టు చెప్పిందని వెంకటేశ్వరరావు ఏబీ వాదించారు.

అయితే ..చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. అయితే ఇజ్రాయిల్ నుండి నిఘా పరికరాల కొనుగోలులో ఏబీ వెంకటేశ్వరరావు నిబంధనలను ఉల్లంఘించారని వైఎస్ జగన్ ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో 8న విధుల్లోంచి సస్పెండ్ చేసింది .

Related posts