telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

సూర్యకు అభినందనలు తెలిపిన మహేష్ బాబు…

సూర్య నటించిన ఆకాశం నీ హదురా  సినిమా ఇటీవల ప్రేక్షకులముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రముఖ దర్శకురాలు సుధ కొంగర ఈ సినిమాని తెరకెక్కించారు. అంచనాలకి తగ్గట్టే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా థియేటర్లలో విడుదల అయితే ఖచ్చితంగా వంద కోట్లను వసూళ్లు చేసిది అంటూ ప్రేక్షకులు మరియు విశ్లేషకులు నమ్మకంగా చెబుతున్నారు.  ఈ సినిమాపై ఇప్పటికే పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాను చూసారు. ట్విట్టర్ వేదికగా చిత్రయూనిట్ కు అభినందనలు తెలిపాడు మహేష్. ముఖ్యంగా సూర్య నటనను ప్రసంశిస్తూ దానికి సూర్య కూడా థాంక్స్ చెప్పారు. ‘టన్నుల కొద్ది ధన్యవాదాలు బ్రదర్ .. సర్కారు వారి పాట సినిమా చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ సూర్య రాసుకొచ్చారు. ఇలా ఇద్దరు స్టార్ హీరోలు సోదరభావం కనబరచడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సూర్య , మహేష్ చిన్ననాటినుంచి మంచి స్నేహితులన్న విషయం తెలిసిన విషయమే..

Related posts