ప్రస్తుతం చిన్నవారి నుంచీ పెద్దల వరకు అందరూ డై వేసుకుంటున్నారు. అది తెల్ల జుట్టు అవుతుందని కావచ్చు. లేదా మరి వేరే స్టైల్ కోసం కావచ్చు. ఏది ఏమైనా డై వాడటం మాత్రం సహజమైపోయింది. చాలామంది ఇంట్లోనే తలకు రంగు (హెయిర్‌డై) వేసుకుంటూ ఉంటారు. కాని సరైన జాగ్రత్తలు పాటించ కపోతే చర్మసమస్యలు ఎదురవ్వవచ్చు.
అందుకని…చర్మ సమస్యలు రాకుండా ఉందేదుకు కొన్ని చిట్కాలను మీకందిస్తున్నాం.
1. జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు చర్మానికి తగలకూడదు.
2. ముందుగా ముఖానికి, చెవులకు మాయిశ్చరైజర్ లేదా నూనె రాసుకొని తర్వాత డై వేసుకోవాలి.
3. తలంటుకునేటప్పుడు కూడా డై చర్మానికి తగలకుండా జాగ్రత్తపడాలి.
4. డై ఎంపికలో నాణ్యత విషయంలో రాజీ పడకూడదు.
5. జుట్టు మంచి స్మెల్ రావాలంటే హెయిర్ సీరమ్ లేదా హెయిర్ స్ప్రేలను వాడాలి. అయితే ఈ సీరమ్స్, స్ప్రేలు మాడుకు, జుట్టు కుదుళ్లకు తగలకుండా జాగ్రత్తపడాలి. లేదంటే వీటిలో ఉండే గాఢ రసాయనాలు వెంట్రుక కుదురును దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి.
							previous post
						
						
					
							next post
						
						
					

