telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

సంక్రాంతి కానుకగా వకీల్ సాబ్…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తి కావచ్చింది. ఈ వేసవికి సినిమా ను రిలీజ్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో శృతిహాసన్‌, అంజలి, నివేథా థామస్‌, అనన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా వకీల్ సాబ్ నుంచి నూతన సంవత్సరం ఓ ట్రీట్ వచ్చింది.. అయితే ఈ సినిమా నుండి అమధ్యే టీజర్ వస్తోందట ప్రచారం జరిగిన విడుదల కాలేదు. దాంతో కనీసం సంక్రాంతి కానుక‌గా చిత్రం నుండి టీజ‌ర్ వ‌స్తుందేమోన‌ని ఆశ‌గా ఎదురు చూస్తున్న అభిమానుల‌కు బూస్ట్ ఇచ్చే అప్డేట్ ఇచ్చింది. జనవరి 14న సాయంత్రం 6 గంటల 03 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేస్తున్నట్లుగా చిత్రబృందం పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇన్ని రోజులు లీక్ ఫొటోలతో తెగ సంబరపడ్డ పవన్ అభిమానులు.. సంక్రాంతి రోజున వకీల్ సాబ్ టీజర్ తో పండగ జరుపుకోనున్నారు. అయితే ‘వకీల్ సాబ్’ నుంచి కొంతకాలంగా ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో మెగా అభిమానులు నిరాశచెందారు. ఈ ఏడాది ట్విట్టర్ లో ట్రెండ్ అయిన ట్యాగ్స్ లలో ‘వకీల్ సాబ్’ కూడా నిలిచింది అంటే హవా ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. వీలైనంత వరకు టీజర్ లో సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేందుకు దిల్ రాజు ప్రయత్నిస్తున్నాడట.

Related posts