telugu navyamedia
రాజకీయ వార్తలు

అమ్మ భాషతోనే అభివృద్ధి సాధ్యం: ప్రధాని మోదీ

pm modi on kargil day

అమ్మ భాషతోనే అభివృద్ధి సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఆదివారం నిర్వహించిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాతృభాషల ప్రాధాన్యాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఐక్య రాజ్య సమితి కూడా మాతృభాషల ప్రాధాన్యాన్ని గుర్తించిందని తెలిపారు. అందుకే ఈ ఏడాదిని ‘అంతర్జాతీయ మాతృభాషల సంవత్సరం’గా ప్రకటించిందని మోదీ గుర్తు చేశారు.

ఉత్తరాఖండ్‌లోని దారుచులా ప్రాంతంలో రంగ్ జాతి ప్రజలు లిపి లేని తమ భాష ‘రంగ్లో’ను పరిరక్షించేందుకు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. పదివేల వరకు ఉండే ఆ జాతి ప్రజలు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని మరీ భాషాభివృద్ధికి పాటుపడుతున్నారని ప్రశంసించారు. ఎవరి భాషను వారు, వారి యాసతో ఉపయోగించడం ప్రారంభించాలని మోదీ సూచించారు. ఎంత అభివృద్ధిని సాధించినా మాతృభాషను విస్మరిస్తే దానికి అర్థం ఉండదని మోదీ పేర్కొన్నారు.

Related posts