telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అమెజాన్ ప్రైమ్ లో వస్తున్న ‘వలస’!

సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం ‘వలస’ అంతర్జాతీయం గా అమెజాన్ ప్రైమ్ లో జనవరి8న స్ట్రీమింగ్ కాబోతోంది. అదే రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో మూవీని విడుదల చేయబోతున్నారు నిర్మాత యెక్కలి రవీంద్రబాబు. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో రోడ్డున పడ్డ వలస కార్మికుల వెతల నేపథ్యం లో ‘వలస’ సినిమాను సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించారు. మనోజ్ నందం, తేజు అనపోజు, వినయ్ మహాదేవ్, గౌరి కీలక పాత్రలు పోషించారు. ప్రవీణ్‌ ఇమ్మడి స్వరపరిచిన ‘తడి గుండెల సవ్వడిలో వినిపించెను గేయం’ పాటకు శ్రోతల నుండి మంచి ఆదరణ లభించిందని, కేవలం వలస కార్మికుల కష్టాలు మాత్రమే కాకుండా, వారి జీవితాల లోని నవరసాలను చూపించిన చిత్రమిదని, ఇప్పటికే సినిమా ను చూసిన కొందరు రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తలు చిత్ర యూనిట్ ను ప్రశంసించారని సునీల్ కుమార్ రెడ్డి చెప్పారు.

Related posts