ఈ ఏడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 ముగిసిన వెంటనే టీం ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళింది. అందులో భాగంగా ఈ నెల 17 నుండి ఆసీస్ తో టెస్ట్ సిరీస్ లో తలపడనుంది. అయితే గత ఏడాది పర్యటనలో భారత టెస్ట్ స్పెషలిస్ట్ చేతేశ్వర్ పుజారా భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. పుజారా నాలుగు టెస్టుల్లో 1258 ఎదుర్కొని 521 పరుగులు చేసాడు. అయితే ఈ సిరీస్ ఆరంభానికి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండటంతో భారత లెజెండ్ సునీల్ గవాస్కర్ పూజారా పై ప్రశంసలు కురిపించాడు. అలాగే ఈ సిరీస్ లో పుజారా బ్యాటింగ్ చూడాలని ఎదురు చూస్తున్నానని చెప్పాడు. గవాస్కర్ మాట్లాడుతూ… పుజారా కరోనా విరామం తర్వాత క్రికెట్ ఆడిన ఆడకపోయినా అతను మానసికంగా చాలా బలంగా ఉన్నాడు. అతను త్వరగా ఔట్ అవుతాడని నేను అనుకోను… అతను బ్యాటింగ్ చేయడానికి, ఎక్కువ సమయంక్రీజులో ఉండటం ఇష్టపడతాడు అని చెప్పిన గవాస్కర్ గత రెండు సంవత్సరాలలో పుజారా తన స్ట్రోక్స్ మరియు షాట్స్ ఆడే విధానాన్ని మెరుగుపరుచుకున్నాడు అని తెలిపాడు. మరి చూడాలి అప్పుడు అదరగొట్టిన పుజారా ఇప్పుడు కూడా చెలరేగుతాడా… లేదా అనేది.
previous post
next post


జగన్ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు: విడదల రజని