telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

రైతుల నిరసన పై సంచలన వ్యాఖ్యలు చేసిన రఘునందన్‌…

Raghunandan

ఢిల్లీలో రైతుల ఆందోళన కేంద్ర తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కొనసాగుతూనే ఉంది. మరోవైపు వారిని చర్చలకు ఆహ్వానిస్తూనే.. రైతుల ఉద్యమంపై ఆరోపణలు చేస్తూ వస్తోంది బీజేపీ.. కేంద్ర మంత్రుల నుంచి గల్లీ నేతల వరకు రైతుల ఆందోళనలపై విషం చిమ్ముతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. తాజాగా రైతుల ఆందోళనపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు… నల్గొండలో మీడియాతో మాట్లాడిన ఆయన.. భారత ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ రైతు ప్రయోజనాల కోసం మూడు చట్టాలు తెచ్చామన్నారు. దేశంలో కొన్ని పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా..! లేనప్పుడు మరోలా! మాట్లాడడం బాధాకరం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను మెజారిటీ రైతులు ఆహ్వానిస్తున్నారన్న బీజేపీ ఎమ్మెల్యే.. వ్యవసాయ చట్టాలపై కార్పోరేటీకరణ పేరుతో చేసే ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు.. అయితే, రైతు నిరసనలన్నీ కార్పొరేట్ ధర్నాలే అంటూ విమర్శించారు రఘునందన్‌రావు.. రైతును రాజు చేసే వ్యవసాయ చట్టాలతో వారికి ఇబ్బందులు ఉంటే సవరిస్తామన్న ఆయన.. అంబానీ, ఆదానీ పేర్లను వాడి రైతులను గందరగోళంలోకి నెట్టొద్దు.. రైతులను బలిపశువులను చేయొద్దు అని ప్రతిపక్షాలను కోరారు. మరి ఈ వ్యాఖ్యల పై వారు ఏ విధంగా స్పందిస్తారు అనేది.

Related posts