telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నాగ చైతన్యాకు అంత బిజినెస్ అవుతుందా..?

అక్కినేని ఫ్యామిలీ వారసుడిగా వచ్చిన నాగచైతన్యా తనదైన ప్రతిభతో యువ సామ్రాట్ అనే పేరును సంపాదించుకున్నాడు. అయితే నాగచైతన్యా, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘లవ్ స్టోరీ’. ఈ సినిమా సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కతోంది. ఇటీవల విడుదలయిన ఫస్ట్ లుక్ విశేష స్పందన పొందింది. అంతేకాకుండా చైతు పుట్టిన రోజు స్పెషల్‌గా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా అందరినీ ఆకట్టుకుంది. లాక్‌డైన్ తరువాత మళ్లీ మొదలైన సినిమా షూటింగ్ ఇటీవల పూర్తిచేసుకుంది. విడుదలకు సంబంధించిన వివరాలపై త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు దాదాపు రూ.35కోట్లు ఖర్చు చేశారు. సినిమాపై నమ్మకంతో ఇంత బడ్జెట్ పెట్టినట్లు ప్రొడక్షన్ వారు తెలిపారు. అందుకనే ఈ సినిమాను ఎలాగైనా థియేటర్లలోనే విడుదల చేయాలని, అన్ని రైట్స్ కలిపి రూ.40 కోట్ల బిజినెస్ అయ్యే చేయాలని ఆలోచిస్తున్నారు. అయితే వరుస విజయాలతో ఉన్న నాగచైతన్యా చేస్తున్న సినిమా కాబట్టి మంచి అంచనాలే ఉన్నాయి. అయితే నాగ చైతన్యాకు అంత బిజినెస్ అవుతుందా అని కొందరు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎంత రాబడుతుంది అనేది.

Related posts