telugu navyamedia
సినిమా వార్తలు

ఈ స్టార్ హీరోయిన్ కు ఎవరూ ప్రపోజ్ చేయలేదట…!?

Rakul Preet Sigh images

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన అవకాశాలు కొట్టేస్తూ స్టార్ హీరోయిన్ గా స్థానాన్ని సొంతం చేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ట్విట్టర్‌లో అభిమానులతో సరదాగా ముచ్చటించింది ఈ బ్యూటీ. నెటిజన్‌లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. తల్లిదండ్రులు తనను చూసి గర్వించే ప్రతిక్షణం ఆనందపడుతానని, తాను సరైన మార్గంలో ప్రయాణిస్తున్నాననడానికి అదే నిదర్శనమని చెప్పింది.

 

అనుష్కశర్మ, అలియాభట్, కాజోల్ తన అభిమాన నాయికలని, సినిమాల్ని అమితంగా ప్రేమిస్తున్నానని తెలిపింది. స్వతహాగా తాను భోజనప్రియురాలినని, ఆరోగ్యకరమైన అన్ని రకాల ఆహారపదార్థాల్ని ఇష్టపడుతానని అంటోంది రకుల్. ఎంత తిన్నా బరువు మాత్రం పెరగకూడదన్నదే తన కల అని తెలిపింది. లండన్ తన ఫేవరేట్ హాలీడే డెస్టినేషన్ అని తెలిపింది రకుల్. అంతేకాదు ఇప్పటివరకు తనకు ఎవరూ ప్రపోజ్ చేయలేదని అంటూ ఆసక్తికరమైన విషయాన్నీ వెల్లడించింది. 

Related posts