వాతావరణ సూచనా ప్రకారం నైరుతి మరియు దాని అనుసంధానంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం 24 గంటల్లో తుఫానుగా బలపడనునట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల 3 రోజులపాటు కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మంగళవారం దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు… బుధవారం, గురువారం దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు.. మిగిలిన చోట్ల మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. సముద్రం అలజడిగా ఉంటుంది. మూడురోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు అని సూచించారు. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేసాము. రైతాంగం వ్యవసాయ పనులయందు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి పేర్కొన్నారు.
previous post


మొత్తానికి రజినీకాంత్ తప్పించుకున్నారు… విజయ్ ఇరుక్కున్నారు… డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు