ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తున్నారు. ఇక రియల్ కారెక్టర్స్‌తో ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. వారి సరసన అలియా, ఒలివియా నటిస్తున్నారు. ఈ క్రమములో షూటింగ్ నుంచి కాస్త బ్రేక్ దొరకడంతో ఎన్టీఆర్ దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేశారు. ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారాయి. నవంబర్ 22 నుంచి ఎన్టీఆర్ మళ్లీ ఆర్ఆర్ఆర్ షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్` పూర్తి కాగానే మార్చి నెల నుంచి త్రివిక్రమ్ సినిమాను ప్రారంభించాలనుకుంటున్నాడట. కరోనా కారణంగా గత ఎనిమిది నెలలు ఇళ్లకే పరిమితమయ్యారు సెలెబ్రిటీలు. ఇప్పుడిప్పుడే షూటింగ్‌ల కోసం బయటకు వస్తున్నారు. కొందరు కుటుంబాలతో కలిసి విదేశాలకు విహార యాత్రలకు వెళుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. చూడాలి మరి ఎన్టీఆర్ ఎప్పుడు వస్తాడు అనేది.
							previous post
						
						
					
							next post
						
						
					


అమరావతిని అభివృద్ధి చేయాలని ఆకాంక్షించా: చంద్రబాబు