telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

బ్యాంకాక్, మయన్మార్ లో భారీ భూకంపం

మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత  మయన్మార్ 7.7, బ్యాంకాక్ లో 7.3 గా నమోదైంది.

బ్యాంకాక్ లో కుప్పకూలిన భవనాలు, బిల్డింగ్స్ షేక్ అయ్యాయి. దీంతో జనం భవంతులకు దూరంగా పరుగులు తీశారు.

స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.50 గంటలకు ఈ భూకంపం సంభవించింది.

సగైంగ్ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో 10 కిమీ లోతున భూకంప కేంద్రం ఉందని గుర్తించినట్లుగా అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ తెలిపింది.

Related posts