telugu navyamedia
క్రీడలు వార్తలు

ధోనికి ఇదే మొదటి ఐపీఎల్ సీజన్… ఎలా అంటే..?

ఈ ఏడాది ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం ముగిసింది. అయితే ఐపీఎల్ లో చెన్నై ప్లే ఆఫ్ కి వెళ్ళకపోవడం ఇదే మొదటిసారి. చెన్నై కి ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభంలోనే షాక్ తగిలింది. మొదట జట్టునుండి రైనా, హర్భజన్ తప్పుకోవడంతో.. ఆ  తర్వాత ఆటగాళ్లకు కరోనా సోకడం వంటిని ఆ జట్టును సమతౌల్యాన్ని దెబ్బతిశాయి. అయితే విజయంతోనే ఐపీఎల్ 2020 ని ప్రారంభించిన చెన్నై ఆ తర్వాత తమ స్థాయికి తగిన ప్రదర్శన చేయలేదు. దాంతో ఆ జట్టుకు మరో మూడు మ్యాచ్ లు మిగిలి ఉండగానే ప్లే ఆఫ్ రేస్ నుండి తప్పుకుంది. కానీ తర్వాత ఆడిన మూడు మాస్క్ లలో విజయం సాధించింది. ఇక చెన్నై జట్టు కూటములకు కెప్టెన్ ధోని నిర్ణయమే కారణం అని విమర్శలు వచ్చాయి. కెప్టెన్సీ లో మాత్రమే కాకుండా బ్యాట్ తో కూడా ధోని పెద్దగా రాణించలేదు. ఎంతంటే… ఐపీఎల్ సీజన్ లో ధోని అర్ధశతకం బాధాకపోవడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది ఐపీఎల్ లో మొత్తం 14 మ్యాచ్ లు ఆడిన ధోని కేవలం 200 పరుగులు మాతరం చేసాడు. అందులో అతని అత్యధిక పరుగులు 47 మాత్రమే. అందువల్లే ధోనికి హాఫ్ సెంచరీ లేని మొదటి ఐపీఎల్ సీజన్ ఇదే. మరి చూడాలి వచ్చే ఏడాది ధోని ఎలా రాణిస్తాడు అనేది.

Related posts