telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కోసం అలియా భట్ వచ్చేస్తుంది

లాక్ డౌన్ కారణంగా షూటింగులకు అంతరాయం కలగడంతో ‘ఆర్ఆర్ఆర్’ కూడా వాయిదా పడిపోయింది. కొవిడ్ నిబంధనల ప్రకారం తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం షూటింగ్ తిరిగి మొదలైంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్‌ను ఈ సినిమా యూనిట్ ప్రేక్షకులకు పరిచయం చేసింది. కొమరం భీమ్‌గా నటిస్తోన్న ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్ ను ఈ నెల 22న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో దానిలోని క్లిప్‌ను విడుదల చేశారు. ఇక చిత్రంలో చరణ్ సరసన సీత పాత్రలో కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ భామ అలియా భట్ ఇంతవరకు ఈ చిత్రం షూటింగులో పాల్గొనలేదు. దీంతో ఆమె వచ్చే నెలలో ఈ చిత్రం షూట్ లో జాయిన్ అవుతున్నట్టు సమాచారం. ఎప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ అయిపోతుందో…థియేటర్లకు ఎప్పుడు వస్తుందో అని ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.

Related posts