నటరత్న, పద్మశ్రీ ఎన్.టి.రామారావు గారు ద్విపాత్రాభినయం చేసిన జానపద చిత్రం డి.వి.ఎస్. ప్రొడక్షన్స్ వారి “గండికోట రహస్యం” 01-05-1969 విడుదలయ్యింది.
నిర్మాత డి.వి.ఎస్.రాజు గారు డి.వి.ఎస్.ప్రొడక్షన్స్ బ్యానర్ పై జానపద బ్రహ్మ బి.విఠలాచార్య దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే: బి.విఠలాచార్య, కథ,మాటలు: జి.కె.మూర్తి, పాటలు: సి.నారాయణరెడ్డి, కొసరాజు, సంగీతం: టి.వి.రాజు, ఫోటోగ్రఫీ: ఎస్.ఎస్.లాల్, కళ: బి.నాగరాజన్ నృత్యం: చిన్ని,సంపత్, ఎడిటింగ్: కె.గోవిందస్వామి. అందించారు.
ఈ చిత్రం లో ఎన్. టి.రామారావు, దేవిక, జయలలిత, రాజనాల, ప్రభాకరరెడ్డి, మిక్కిలినేని, రాజబాబు
త్యాగరాజు, అల్లు రామలింగయ్య, రావి కొండలరావు, పి.హేమలత, రమాప్రభ,, టి.జి.కమలాదేవి,
జగ్గారావు, నల్ల రామమూర్త, సారధి తదితరులు నటించారు.
ప్రఖ్యాత సంగీత దర్శకుడు టి.వి.రాజు గారి స్వరకల్పనలో వెలువడిన పాటలు అయ్యాయి.
“కన్నెలోయ్ కన్నెలు,కవ్వించే కనుసన్నలు”
“మరదలుపిల్లా ఎగిరిపడకు, గడుసరిపిల్లా వులికి పడకు”
“తెలిసింది తెలిసింది అబ్బాయిగారూ”
“నీలాల నింగి మెరిసి పడే నిండు చందురుడా”
వంటి పాటలు ప్రేక్షకులను అలరించాయి.
ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు గారు ద్విపాత్రాభినయం (రాజు, పల్లెటూరు వాడు) చేశారు. ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించి, మంచి కలెక్షన్స్ తో కమర్షియల్ విజయం సాధించింది.
ఈ చిత్రం పలు కేంద్రాలలో 50 రోజులు పైగా ప్రదర్శింపబడింది
విజయవాడ – దుర్గా కళామందిరం లో 69 రోజులు (10 వారాలు) ఆడింది…
“గండికోట రహస్యం” సినిమాను హిందీలోకి డబ్బింగ్ చేసి “భగవత్” పేరు తో 14-08-1971 తేదీన విడుదల చేశారు.


ఈ సమయంలో సినిమా ప్రమోషన్స్ అవసరమా ?