సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా రూపొందిన చిత్రం శ్రీమంతుడు. సూపర్‌స్టార్ మహేష్ బాబు, అందాల భామ శ్రుతి హాసన్ కలిసి నటించగా ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ దీన్ని తెరకెక్కించారు. ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం అప్పట్లో నాన్ బాహుబలి రికార్డులను సెట్ చేసి మహేష్ కెరీర్ లో మరో బ్రేక్ ను ఇచ్చింది. ఓవైపు మెసేజ్ ఇస్తూనే మరోవైపు మాస్ ఎలిమెంట్స్ కూడా మిస్ కాకుండా కొరటాల తెరకెక్కించాడు ఈ సినిమాను. మహేష్ బాబును అప్పటి వరకు ఏ దర్శకుడు చూపించని విధంగా ఇందులో చూపించాడు శివ. కొరటాల శివ ఇచ్చిన సోషల్ మెసేజ్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. అంతకు ముందు వచ్చిన “దూకుడు” తర్వాత మహేష్ స్టార్డంకు తగ్గ రేంజ్ హిట్ అందుకుంటారు అన్న ప్రతీసారీ అభిమానులకు నిరాశ తప్ప లేదు. ఇక అక్కడ నుంచి ఒక్క సినిమా మినహా అన్ని వరుస విజయాలను అందుకొంటూ తన ఫ్యాన్స్ ను ఖుషీ చేసారు. ఇప్పుడు ఈ చిత్రం ఐదేళ్లు పూర్తి చేసుకోవడంతో సోషల్ మీడియాలో “శ్రీమంతుడు” సినిమా విశేషాలు హల్చల్ చేస్తున్నాయి. ఈ కాంబినేషన్‌లో గతేడాది వచ్చిన “భరత్ అనే నేను” కూడా మంచి విజయం సాధించింది.
previous post

