నటరత్న ఎన్.టి.రామారావు నటించిన సాంఘిక చిత్రం “సరదా రాముడు” 14 నవంబరు 1980 న విడుదలయ్యింది.
నిర్మాత యస్.రియాజ్ బాషా హిందీలో విజయవంతమైన జంగ్లీ (1961) చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తూ సైఫ్ ఎంటర్ ప్రైజస్ బ్యానర్ పై దర్మకుడు కె.వాసు దర్శకత్వం లో ఈచిత్రాన్ని నిర్మించారు.
ఈచిత్రానికి స్క్రీన్ ప్లే: కె.వాసు, మాటలు: జంధ్యాల, పాటలు: వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతం: చక్రవర్తి, పొటోగ్రఫీ: పి.యన్.సుందరం, కళ: భాస్కరరాజు, నృత్యం: సలీం, కూర్పు: రవి అందించారు.
ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, జయసుధ, రావుగోపాలరావు, కాంతారావు, యస్.వరలక్ష్మి, మోహన్ బాబు, కవిత, ప్రభాకరరెడ్డి, విజయలలిత, రాజబాబు, జయమాలిని, శ్రీహరి, తదితరులు నటించారు.
ప్రఖ్యాత సంగీత దర్శకుడు చక్రవర్తి గారి సంగీత సారధ్యంలో వచ్చిన పాటలన్ని హిట్ అయ్యాయి.
“ఒక్కరిద్దరయ్యే వేళ ఇద్దరొక్కటయ్యే వేళ”
“మంచుమొగ్గ ముంచుకొచ్చి వానపూలు కోసుకొచ్చి” “సల్లంగ జారి మెల్లంగ దూరి”
“యాహూ,యాహూ,అంబ పలికిందిరా,రంభ కులికిందిరా,”
వంటి పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.
కడప సాయిబాబా ధియేటర్ లో 36 రోజులు ఆడింది.
ఈ చిత్రం యావరేజ్ విజయాన్ని అందుకుని కొన్ని కేంద్రాలలో షిఫ్ట్ లపై 50 రోజులు ప్రదర్మింపబడింది…
previous post
రాజకీయాలకంటే సినిమా రంగమే గొప్పది..