పరువు హత్య కు గురైన హేమంత్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసారు. ఈ కేసులో ఇప్పటివరకూ 12 మంది కస్టడీ విచారణ పూర్తి చేసారు పోలీసులు. మొదట సుపారి ఇచ్చిన ముఠాలో రిమాండ్ లో ఉన్న ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఇప్పటికే ప్రధాన నిందితులు యుగేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి తోపాటు ఎరుకల కృష్ణ, బిచ్చు యాదవ్, మహ్మద్ పాషా లతో పోలీసులు సీన్ రీకంస్ట్రక్షన్ పూర్తి చేసారు. దర్యాప్తు చేస్తున్న ఇద్దరు గచ్చిబౌలి ఇన్పెక్టర్లకు కోవిడ్ సోకడంతో రాయదుర్గం ఇన్పెక్టర్ రవీందర్ కి కేసు దర్యప్తు బాద్యతలు అప్పగించారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పడే లోపు దర్యాప్తు పూర్తి చేస్తాం… నిందుతులకు త్వరగా శిక్ష పడేలా చేస్తాం అని మాదాపూర్ ఇంచార్జ్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.
అయితే హేమంత్ హత్య కేసును పరువు హత్యగా, కులాంతర వివాహం చేసుకున్నందుకే సుపారీ గ్యాంగ్‌తో కలిసి హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో యుగందర్‌రెడ్డి, అవంతి తండ్రి లక్ష్మారెడ్డి ఒప్పుకున్నారు. అవంతి-హేమంత్ ప్రేమ వివాహం తెలిసి ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టించిన లక్ష్మారెడ్డి.. 6 నెలల పాటు అవంతిని బయటకు వెళ్లకుండా కట్టడి చేశాడు. జూన్ 10న ఇంట్లో కరెంట్ పోవడంతో సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడం లేదని తెలిసి..హేమంత్‌తో అవంతి పారిపోయింది.
ఏపీ డేటా ఎక్కడా లీక్ కాలేదు: మంత్రి చినరాజప్ప