telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ప్రశ్నాపత్రం లీక్‌ ఘటనలో 12 మంది అరెస్టు

అంకిరెడ్డిపల్లెలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్‌ ఘటనలో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
నిన్న తొలిరోజు గ్రామంలో పరీక్షలు ప్రారంభమైన గంటన్నర తరువాత ప్రశ్నాపత్రం లీక్‌ వదంతులు వ్యాపించాయి.
ముందుగా అవాస్తమని కొట్టిపారేసిన విద్యాశాఖ, జిల్లా ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.

విద్యాశాఖ, పోలీసులు కలిసి పాఠశాలలో విచారణ ప్రారంభించడంతో నిజమని తేలాయి. పరీక్ష ప్రారంభమైన తర్వాత సీఆర్పీ రాజేశ్‌ మొబైల్‌లో ఫొటో తీసి 9 మంది టీచర్లకు పంపాడని కలెక్టర్‌ తెలిపారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్‌ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

దీంతో సీఆర్పీ రాజేశ్‌తో పాటు తెలుగు టీచర్లను అరెస్టు చేశారు. చీఫ్‌ సూపరింటెండెంట్‌, ఇన్విజిలేటర్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్‌, ఫ్లయింట్‌ స్క్వాడ్‌ను సస్పెండ్ చేశామని వెల్లడించారు.

Related posts