telugu navyamedia
క్రీడలు వార్తలు

న్యూజిలాండ్ జట్టుపై షేన్ వార్న్ అసంతృప్తి…

ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ మాట్లాడుతూ… కివీస్ తుది జట్టులో ఒక్క స్పిన్నర్‌ను ఆడించకపోవడం నిరాశకు గురిచేసిందన్నాడు. ఇది ఆ జట్టు కొంపముంచుతుందని కూడా చెప్పుకొచ్చాడు. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తాము పేస్ ఆల్‌రౌండర్‌తో పాటు ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. వాతావరణం కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో స్పిన్నర్ ఆజాజ్ పటేల్‌ను తీసుకోలేదని, పేస్ ఆల్‌రౌండర్ కోలిన్ గ్రాండ్ హోమ్‌ను తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. పైగా భారత జట్టు స్పిన్‌ను సమర్థవంతంగా ఆడుతుందని, అందుకే తీసుకోలేదని కూడా వెల్లడించాడు. ఇక భారత జట్టు మాత్రం ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగింది. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ పిచ్ స్పిన్నర్లకు అవకాశం ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఫోర్త్ ఇన్నింగ్స్‌లో వారిని ఎదుర్కోవడం కష్టమంటున్నారు.

Related posts