telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మరోసారి పెరిగిన పెట్రోల్, డీజీల్ ధరలు…

పెరిగిన పెట్రోల్ ధరలు మళ్ళీ పెరిగాయి. ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధ‌ర‌లు సెంచ‌రీ దాటేశాయి.. డీజిల్ ధ‌ర రూ.95 వ‌ర‌కు చేరింది.. తాజాగా లీట‌ర్‌ పెట్రోల్‌పై 30 పైస‌లు, లీట‌ర్ డీజిల్‌పై 31 పైస‌ల చొప్పున వ‌డ్డించాయి చ‌మురు సంస్థ‌లు.. దీంతో ఢిల్లీలో పెట్రోల్, డీజిల్‌ ధ‌రలు రికార్డు స్థాయికి చేరాయి. లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.97.22కు, లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.87.97కు చేరింది.. దేశంలోని ఇత‌ర ముఖ్య‌మైన న‌గ‌రాల్లో పెట్రో ధ‌ర‌ల‌ను గ‌మ‌నిస్తే.. ముంబైలో పెట్రోల్ రూ.103.36కు చేరుకోగా.. డీజిల్ రూ.95.44గా ఉంది.. భోపాల్‌లో పెట్రోల్ రూ.105.43కాగా, డీజిల్ రూ.96.65కు పెరిగింది.. ఇక‌, పాట్నా పెట్రోల్ రూ.99.28గా ఉంటే.. డీజిల్ రూ.93.30కు పెరిగింది.. హైద‌రాబాద్‌లోనూ సెంచ‌రీ దాటి ప‌రుగులు తీస్తోంది పెట్రోల్ ధ‌ర‌.. హైద‌రాబాద్‌లో తాజా రేట్లు గ‌మ‌నిస్తే.. లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ101.19కు చేరుకోగా.. డీజిల్ రూ96.04గా ప‌లుకుతోంది.

Related posts