ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్ లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. రెండేళ్ల పాటు రాజకీయాలతో బిజీగా ఉండి ఇప్పుడు వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ముందుగా నయనతారను ఆ తర్వాత పూజా హెగ్డే శృతి హాసన్ నటిస్తోందనే వార్తలు పుకార్లుచేసాయి. ఈ క్రమంలో ఆయన చేస్తున్న ‘వకీల్ సాబ్’ సినిమాలో సీనియర్ హీరోయిన్ ఇలియానాకు అవకాశం కల్పించారని తెలుస్తోంది. దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కూడా ఫినిష్ అయింది. పవన్ కళ్యాణ్‌తో గోవా బ్యూటీ ఇలియానా రొమాన్స్ చేయనుండటం అనేది మెగా అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. గతంలో పవన్- ఇలియానా కాంబోలో వచ్చిన ‘జల్సా’ మూవీ సూపర్ హిట్ సాధించింది కాబట్టి ‘వకీల్ సాబ్’కి సెంటిమెంట్ రిపీట్ చేయడం ఖాయమని చెప్పుకుంటున్నారు.