ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు స్టీవ్ స్మిత్. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను స్మిత్ వెనక్కి నెట్టాడు. ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్ మూడో ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక స్థానం మెరుగుపరుచుకుని నాలుగో ర్యాంకులో నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో విఫలమైన ఇంగ్లండ్ సారథి జో రూట్ ఐదో స్థానానికి పరిమితం అయ్యాడు. భారత ప్లేయర్స్ రిషబ్ పంత్ (797), రోహిత్ శర్మ (797) ఇద్దరూ ఆరో స్థానంలో నిలిచారు. డబుల్ సెంచరీ చేసిన డేవాన్ కాన్వే బ్యాటర్ల జాబితాలో సంయుక్తంగా 61వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో ప్రతి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ 307 రేటింగ్‌తో 64వ స్థానంలో నిలిచాడు. స్పిన్నర్ అజాజ్ పటేల్ కెరీర్ బెస్ట్ 323 రేటింగ్ సాధించాడు. ప్యాట్ కమిన్స్ (908), రవిచంద్రన్ అశ్విన్ (850), టిమ్ సౌథీ (830) టాప్-3 బౌలర్లుగా ఉన్నారు. కాగా టాప్-10లో యాష్ మినహా భారత్ నుంచి మరెవ్వరూ లేరు. ఆల్‌రౌండర్ల జాబితాలో అశ్విన్ 2, రవీంద్ర జడేజా 4 స్థానాల్లో కొనసాగుతున్నారు.
previous post
next post
ఉద్యోగం కావాలంటే పరాయి రాష్ట్రానికి వెళ్లాల్సిందేనా?: చంద్రబాబు