telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ విషయంలో ఎవరూ పర్‌ ఫెక్ట్‌ కాదు : ఇలియానా

నడుమందాలతో టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన భామ ఇలియానా. ఈ గోవా బ్యూటీ తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా టాలీవుడ్ లో చబ్బీ హీరోయిన్ల ట్రెండ్ కు చెక్ పెట్టి ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. పోకిరి, జులాయి, లాంటి సినిమాల్లో ఈ భామ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ప్రస్తుతం ఈ భామ తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో సైతం నటిస్తోంది. కానీ కేవలం సెలెక్టివ్ పాత్రలకు ఇలియానా ఒకే చెబుతున్నట్టు తెలుస్తోంది. దాంతో ఈ అమ్మడి సినిమాలు చాలా తక్కువగానే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఇలియానా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అందం, శరీర సౌష్టవంతో ఎవరూ పర్ఫెక్ట్ గా ఉండలేరని.. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉండి తీరుతుందని వ్యాఖ్యానించింది. స్వీయ లోపాలను అధిగమించే క్రమంలో చక్కటి రూపం వస్తుందని పేర్కొంది. ఒక్కోసారి అద్దంలో చూసుకున్నప్పుడు ముఖంపై మచ్చలు..మొటిమలు కామన్ అని వాటిని సీరియస్ గా తీసుకోవద్దని చెప్పింది. మన లోపాలను అధిగమిస్తూ సక్సెస్ ఫుల్ జీవితాన్ని సాగించడంలోనే అసలైన ఆనందం ఉంది అని పేర్కొంది. వ్యక్తుల్లో దాగి ఉండే మనోస్థాయిల బేధాలే ప్రతిఒక్కరికి వారిదైన స్వాతంత్ర్య వ్యక్తిత్వాన్ని తీసుకువస్థాయని తెలిపింది.

Related posts