మన దేశంలో ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా వ్యాక్సిన్ ను దశల వారిగా అందిస్తున్నారు. అయితే వచ్చే నెల 1 నుండి 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. అయితే వారికీ కూడా వ్యాక్సిన్ ఫ్రీ గా ఇస్తామని ఇప్పటికే పలు రాష్ట్రాలు ముందు రాగా.. తాజాగా మహారాష్ట్ర కూడా ఫ్రీ అంటూ ప్రకటన చేసింది.. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేయాలని తమ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు.. అందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇస్తామని ఆ రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ప్రకటించారు.. కాగా, భారత్లో కోవిడ్ కేసులు వరుసగా కల్లోలం సృష్టిస్తుండగా.. అందులో మెజార్టీ కేసులు మహారాష్ట్రలోనే వెలుగు చూస్తున్నాయి.. రోజుకో రికార్డు తరహాలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.. మరోవైపు.. 18 ఏళ్లు పైబడినవారికి అందిరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం ప్రకటించినా.. దానిలో క్లారిటీ లేకపోవడంతో.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. వ్యాక్సిన్ కోసం ప్రత్యే బడ్జెట్ను కేటాయిస్తున్నాయి. మరి చూడాలి ఇంకా ఏ ఏ రాష్ట్రాలు దీనిని ప్రకటిస్తాయి అనేది.
previous post