telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

షాకింగ్… విశాఖ ఉక్కు కర్మాగారం మూతపడబోతోంది… శివాజీ వ్యాఖ్యలు

hero shivaji comments Cm kcr

ఆపరేషన్ గరుడ శివాజీ మళ్లీ తెరపైకి వచ్చారు. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీపై వీర విధేయతను ప్రదర్శించి.. చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఆపరేషన్ గరుడ అంటూ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన శివాజీ ఎన్నికల తరువాత సైలెంట్‌ అయిపోయారు. అయితే మళ్లీ ఏపీలో రాజధాని సెగలు రేగుతున్న నేపథ్యంలో మళ్లీ తెరపైకి వచ్చిన శివాజీ మరో కొత్త ప్రణాళికతో వచ్చారు. విశాఖపట్నంలో భారీ కుట్ర జరగబోతుందంటూ సంచలన విషయాలను తెలిపారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “చంద్రబాబుతో పనిచేసిన వాళ్లే ఆయన్ని ఇప్పుడు బండబూతులు తిడుతున్నారు. ఇది గమనించిన ప్రజలు ఏం చేయగలుగుతున్నారు. మన కళ్ల ముందు దోచుకుంటున్నవాడ్ని.. మన కళ్ల ముందు దోచుకుతింటున్న వాడ్ని చొక్కాపట్టుకుని నిలిదీస్తున్నారా ప్రజలు. వీళ్లు అడగనంతవరకూ ఇదే జరుగుతుంది. కమ్యునిజం ఎప్పుడైతే డౌన్ అయ్యిందో అప్పుడే ఈ దేశానికి శని పట్టింది. ప్రజలు ఒక్క తాటిపైకి వస్తే.. లీడర్స్ వాళ్లంతట వాళ్లే సెట్ అవుతారు. ప్రజల్లో ఉన్న బలహీనతలను రాజకీయ పార్టీలు క్యాష్ చేసుకుంటున్నాయి. కనీసం ఇప్పటికైనా మారండి.

నేను ప్రత్యేకహోదా కోసం నా విలువైన సమయాన్ని ఐదేళ్లు కేటాయించా. నా ప్రాంతం కంటే నాకు ఏదీ ఎక్కువ కాదనుకున్నా.. అందుకే ఐదేళ్లు ప్రత్యేక హోదా కోసం పోరాడా. నేను పుట్టిన గడ్డకు ఏదైనా చేయాలనుకున్న అంత పోరాటం చేస్తే మీలో ఎంతమంది రియాక్ట్ అయ్యారో మీ గుండెలపై చేయి వేసుకుని చెప్పండి. ఇప్పుడు రాజధాని ప్రాంత రైతుల్ని ఇష్టం వచ్చినట్టు మాటలు అంటూ.. ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే వాళ్ల ఉసురు మీకు తగలదా? భూములు ఇచ్చినందుకు పోలీసులతో కొట్టిస్తారా? అమరావతిని అక్కడే ఉంచుతామని ప్రామిస్ చేశారు కదా.. జగన్ అంటే మాటతప్పను మడమ తిప్పను అంటారు కదా.. ఇప్పుడు రాజధాని విషయంలో ఎందుకు మాట తప్పుతున్నారు. ఎవరికీ తెలియని రహస్యం ఒకటి మీకు చెబుతున్నా… దక్షణ కొరియాకి సంబంధించిన ఓ ఐరన్ కంపెనీ.. పోస్కో దాని కంపెనీ. దాన్ని ఇక్కడకు తీసుకురావడం కోసం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని చంపేస్తున్నారు. ఇది నిజం. ఇవాళ విశాఖ ఉక్కు అనేది 40 వేల మంది ఉద్యోగులు, లక్షమంది డైరెక్ట్‌గా ఇన్ డైరెక్ట్‌గా ఉపాధి పొందుతున్న విశాఖ ఉక్కు కర్మాగారం త్వరలో మూతపడబోతోంది. 60 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల త్యాగం విశాఖ ఉక్కు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెలంగాణ ఆంధ్ర ప్రాంత నేతల త్యాగాల ఫలితంగా వచ్చిన విశాఖ ఉక్కు కర్మాగారం త్వరలో కనుమరుగవ్వబోతుంది. మీకు ఈ రహస్యం ఎవరికైనా తెలుసా? ఇది నిజం కాదని కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పమనండి.

కేంద్ర ఉక్కుశాఖా మంత్రి.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గరకు ఎప్పుడు వచ్చారో ఒకసారి గుర్తుతెచ్చుకోండి. ఆ రోజు వీళ్లు మర్యాదపూర్వకంగా కలిశాం అని చెప్పారు. కాని అది నిజం కాదు. రహస్య ఒప్పందం ప్రకారమే కలిశారు. ఆరోజు పోస్కో కంపెనీ విశాఖలో రెండు వేల ఎకరాలు కావాలని.. ఆ భూమి ఇస్తే విశాఖలో ఈ కంపెనీ పెడతాం అని వస్తే.. వాళ్ల ఒప్పందాల కోసం వచ్చారు. ఆ కంపెనీ 2013 వరకూ వెయ్యికోట్ల లాభాల్లో ఉంది. ఈరోజు నేను చెప్తున్నా.. రాసిపెట్టుకోండి.. విశాఖ ఉక్కు కర్మాగారం చచ్చిపోతోంది.. ఆంధ్రప్రదేశ్ ఉన్న రైతులు ఎంతమంది వాళ్లకు అండగా నిలబడతారో నేను చూస్తా. తప్పకుండా నిలబడండి. పోస్కో కంపెనీని ఒరిస్సా వాళ్లు తన్ని తరిమేస్తే.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వస్తోంది. ఈ విశాఖ పట్నానికి ఎవరు మీడియేటర్ ఉన్నారో మీరే ఆలోచించండి. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలుసు కాని ఆ పేరు చెప్పడం ఇష్టం లేదు. తెలుగు వ్యక్తే.. ఢిల్లీలో పదవిలో ఉన్న వ్యక్తే. దమ్ముంటే విశాఖ ఉక్కుని కాపాడండి. సాటి రైతుకి అన్యాయం జరుగుతుందంటే ముందుకు రాని వాళ్లు రేపటి రోజున ఉక్కు కర్మాగారాన్ని మూసేసినా పట్టించుకోరు. త్వరలో విశాఖ ఉక్కు కార్మికులు రోడ్డు మీదికి రాబోతున్నారు. మీరు రాసిపెట్టుకోండి. మరో ఆరునెల్లో విశాఖ ఉక్కు మూసివేత వార్త బయటకు రానుంది. అప్పట్లో విశాఖ ఉక్కుకోసం 60 వేల ఎకరాలు ఇచ్చారు. వైజాగ్ అంటేనే స్టీల్ ఫ్యాక్టరీ.. త్వరలో అది కనుమరుగవ్వబోతోంది. మన ముఖ్యమంత్రి జగన్‌ని దమ్ముంటే దీన్ని ఆపమనండి చూద్దాం.

వైజాగ్ మీద అంత ప్రేమ ఉందంటున్న జగన్‌ని విశాఖ ఉక్కు మూసివేతను ఆపమనండి. విశాఖ ఉక్కుకోసం పార్లమెంట్‌లో పోరాడమనండి. వాళ్లు పోస్కో గురించి పోట్లాడతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ కంపెనీ తరుపున విశాఖ ఉక్కుకి సంబంధించిన 60 వేల ఎకరాల్లో 2 వేల ఎకరాలు పోస్కో కంపెనీకి ఇవ్వమని అడుగుతున్నారు. ఇక్కడ విశాఖ ఉక్కు కంపెనీ ఉండగా.. వేరే ఉక్కు కంపెనీ ఎందుకు? ఇది కుట్ర కాదా? విశాఖ ఉక్కుకి సొంత గనులు లేవు.. గనులు కేటాయించమనండి చూద్దాం. ఈ మధ్యనే బీజేపీతో దోస్తీ కట్టిన పవన్ కళ్యాణ్‌ని అయినా విశాఖ ఉక్కు కర్మాగారం మూతపడకుండా ఆపమనండి. పవన్‌తో అవుతుందని ఆయన అనుకుంటున్నారు కదా.. ఇది చేయమని చెప్పండి. ఖచ్చితంగా చేయలేరు. రాజకీయం అనేది వ్యాపారం అయిపోయింది. ఇది ప్యూర్ బిజినెస్. ఇది ప్రజలు తెలుసుకోకపోతే వీళ్లని ఎవరూ బాగు చేయలేరు. లీడర్ అనేవాడు ఆ టైంకి వస్తాడు.. ఈరోజు చంద్రబాబు, లోకేష్ బాబు వల్ల ఏం కాదు అని చాలామంది అంటున్నారు. అంతెందుకు లోకేష్ బాబు నెక్స్ట్ లీడర్ అని ఏనాడైనా చంద్రబాబు చెప్పారా? చంద్రబాబు ఏజ్ అయిపోయిందని అంటున్నారు.. మరి ప్రధాని మోదీ ఏజ్ బాగుందా? ఆయన ఇంకా యువకుడా? ఇంకో 20 ఏళ్లు ఉంటాడా? చంద్రబాబుకంటే మోదీ 20 ఏళ్లు చిన్నోడా? ఇద్దరూ ఒకటే ఏజ్ కదా.. మరి ఇదెక్కడి వాదన. అంతెందుకు బొత్స సత్యనారాయణ ఏమైనా చిన్న పిల్లగాడా? వాళ్ల పార్టీలోనూ ముసలివాళ్లు ఉన్నారుగా. రాహుల్ గాంధీ చిన్నోడు.. మోదీ ప్రధాని అయ్యారుగా.. ఇవన్నీ యూట్యూబ్ న్యూస్. జనంలోకి ఎక్కువ వెళ్లేవి ఇవే కదా.. కంపెనీలు తయారైన మాట వాస్తవమే.. ఎలాంటి కంపెనీలు అంటే ప్రశాంత్ కిషోర్ కంపెనీ లాంటివి. ఒక లీడర్‌ను ఇలా ఎస్టాబ్లిష్ చేయాలనేది కూడా బిజినెస్‌గా మారిపోయింది” అంటూ సంచలన కామెంట్స్ చేశారు హీరో శివాజీ.

Related posts