telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ రాజకీయ వార్తలు

తాను తీసుకున్న గోతిలో.. తానే పడ్డ చైనా.. కరోనా వైరస్ సృష్టి.. !

china found vaccine for corona virus

కరోనా వైరస్ సహజంగా పుట్టలేదని, డ్రాగన్ దేశం స్వయంకృతమేనన్న కథనం కలకలం రేపుతోంది. అంతర్జాతీయ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్ రోజురోజుకీ పదుల సంఖ్యలో ప్రాణాల్ని బలిగొంటోంది. నిన్న ఒక్కరోజే 26 మంది మరణించారు. దీంతో చైనాలో కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 170కి చేరింది. మరో 7700 మంది ఈ వైరస్‌ బారిన పడ్డట్లు వైద్యులు ధ్రువీకరించారు. వీరిలో 1,239 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ అంటువ్యాధికి కేంద్రంగా మారిన వుహాన్‌ నగరంలోనే ఇప్పటి వరకు 125 మంది ప్రాణాలు విడిచారు. మరో 3,554 మంది వైరస్‌తో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న హుబెయ్ ప్రావిన్సులో 840 కొత్త కేసులు నమోదయ్యాయి.

మరో పది రోజుల్లో ఈ వైరస్‌ తీవ్రరూపం దాల్చి మృతులు సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని చైనా ఆరోగ్య రంగ నిపుణుడు ఝోంగ్‌ నాన్‌షన్‌ హెచ్చరించారు. బాధితుల్ని వీలైనంత త్వరగా గుర్తించి వారిని దూరంగా ఉంచడమే ప్రస్తుతానికి వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఉన్న ఏకైక మార్గమని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చైనా ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ నిపుణుల కమిటీకి ఝోంగ్‌ నేతృత్వం వహిస్తున్నారు. జ్వరం, బలహీనంగా మారడమే వైరస్‌ సోకిన వారిలో కనిపిస్తున్న ప్రముఖ లక్షణాలని తెలిపారు. ఏమాత్రం అనుమానం ఉన్నా.. వైద్యుల్ని సంప్రదించాలని సూచించారు. చైనాలో కరోనా కేంద్ర బిందువుగా ఉన్న వుహాన్ లో తెలుగు ఇంజినీర్లు చిక్కుకుపోయారు.

క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలక్ట్ అయిన వీళ్లు.. ట్రైనింగ్ కోసం వుహాన్ వెళ్లిన 58 మంది టీసీఎల్ కంపెనీ హాస్టల్ లో ఉన్నారు. కరోనా వార్తలు రాగానే.. వీరిని స్వస్థలాలకు చేర్చేందుకు ప్రయత్నించినా.. అప్పటికే ప్రయాణాలపై నిషేధం అమల్లోకి వచ్చింది. దీంతో తమ పిల్లల్ని భారత్ తీసుకురావాలని ఇంజినీర్ల తల్లిదండ్రులు కోరుతున్నారు. వుహాన్‌లోని ఓ సముద్రపు జీవుల విక్రయశాల నుంచి కరోనా వైరస్ పుట్టిందని, దీన్ని చైనా జీవాయుధంగా ప్రయోగిస్తోందని సంచలన కథనాలు వచ్చాయి. కొత్త వ్యాధులు అరికట్టడానికి పరిశోధనలు చేసే పీ ఫోర్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీకైందని జీ ఫైవ్ న్యూస్ కథనం ప్రచురించింది. కరోనా మొదలైన మొదట్లో చైనా ప్రభుత్వ తీరు కూడా అనుమానాస్పదంగానే ఉందని, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ సాయాన్ని కూడా తిరస్కరించిందని తెలిపింది. అయితే ఈ కథనాలకు ఎలాంటి ఆధారాల్లేవని చైనా అధికారులు కొట్టిపారేశారు.

Related posts