లాక్డౌన్ కారణంగా ఎప్పుడూ తీరకలేని సెలబ్రిటీలు ప్రస్తుతం ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో రకరకాల ఛాలెంజ్‌లను విసురుకుంటున్నారు. అందులో భాగంగానే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా మగవారికి ‘బీ ద రియల్ మెన్’ అనే ఛాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే కదా. ఇప్పుడు దీన్నిసెలబ్రిటీలందరూ స్వీకరిస్తూ.. ఇంటిపనులు చేస్తూ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఇలా యంగ్ టైగర్ ఎన్టీఆర్ విసిరిన ఈ ఛాలెంజ్‌ను చిరు తనదైన స్టైల్లో చేసి చూపించారు. ఈ ఛాలెంజ్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్, సూపర్ స్టార్ రజినీ కాంత్, మణిరత్నం వంటి దిగ్గజాలను నామినేట్ చేశారు. అయితే చిరు ఉప్మా పెసరట్టు వేసి ఆశ్చర్యపరిచారు. దీనిపై నిర్మాత పీవీపీ ట్వీట్ చేశారు. ఇలా చేసి మా సంసారంలో నిప్పులు పోయవద్దు అంటూ ట్వీట్ చేశారు. ‘చిరంజీవి గారు, ఏదో ఇంట్లో అంట్లు తోమగలము, గచ్చు కడగగలము కానీ మీరిలా స్టార్ చెఫ్‌లా నలభీమ పాకము వండుతుంటే, మా ఆవిడ మెగాస్టారే చేయగలేనిది, మీకేమిటి అంటున్నారు. దయచేసి మా సంసారంలో నిప్పులు పోయొద్దు రియల్ లైఫ్ మెగాస్టార్ గారు’ అంటూ పీవీపీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
నేనెప్పుడూ పవన్ కళ్యాణ్ అభిమానినే : హరీష్ శంకర్