మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన సినిమా ‘గని’ . కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ భామ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా లో వరుణ్ బాక్సర్‌గా నటిస్తున్నాడు.
ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో సినిమా తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది.
ఈ క్రమంలో ‘కొడితే’ అనే స్పెషల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఇటీవల విడుదలైన లిరికల్ వీడియోకు మంచి స్పందన లభించగా చిత్ర బృందం గురువారం పూర్తి వీడియోను విడుదల చేసింది.
ఇప్పటికే పలు చిత్రాల్లోని స్పెషల్ సాంగ్స్‌లో కనిపించి, ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన తమన్నా ‘గని’తో మరోసారి సందడి చేసింది. ఈ పాటలో ఎప్పటిలానే తమన్నా డ్యాన్స్‌తో కుర్రకారును ఫిదా చేసింది. హాట్ లుక్స్‌లో అదరగొట్టింది మిల్కీ బ్యూటీ. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించి ఇప్పటికే హైప్‌ని సృష్టించాడు.
‘గని’కి తమన్ స్వరాలందించగా జగపతిబాబు, ఉపేంద్ర, నవీన్ చంద్ర, సునీల్‌శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు. రెనైసాన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్లపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదలకానుంది.
ఆ బాలీవుడ్ సినిమా చేసినందుకు బాధ పడడం లేదు : పూజాహెగ్డే