telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

పెట్రోల్ ధరల పెంపుకు కారణం ఏంటో తెలుసా..?

no licence renewal required to petrol and

మన దేశంలో లాక్ డౌన్ తర్వాత వాహనాల కొనుగోలు ఎక్కువైంది. అయితే ప్రస్తుతం ఇంధనం ధరలు ఆకాన్నంటుతున్నాయని, ఉత్పత్తి తక్కువగా ఉండటంతోనే వాటి ధరలు ఇంతలా పెరిగిపోతున్నాయని కేంద్ర పెట్రోలియం అండ్ నాచురల్ గ్యాసెస్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. కరోనా కారణంగా ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని దాంతో సప్లైలో హెచ్చుతగ్గులు అధికంగా వస్తున్నాయని, దాని కారణంగా ఇంధనం ధరలు పెరిగాయన ఆయన అన్నారు. ‘ మనం మనకు కావలసిన క్రూడ్ ఆయిల్‌లో దాదాపు 80శాతం వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. అదే మనకు పెద్ద ఛాలెంజ్‌గా ఉంది. ఇంధన ఉత్పత్తి దేశాలలో చాలా వరకు తమ ఉత్పత్తిని నిలిపివేశాయి లేదా తగ్గించాయి. దాని కారణంగానే ఇంధనం ధరల్లో ఒత్తిడి చాలా వస్తుంది. డిమాండ్, సప్లైల మధ్య అంతరం గణనీయంగా పెరుగుతోంద’ని ప్రధాన అన్నారు. ఈ విషయం మాట్లాడిన ప్రదాన దీంతో పాటు దేశంలో ఇంధన వాడకం రోజురోజుకు పెరుగుతోందని, ఎనర్జీ వాడకంలో దేశం మూడవ స్థానంలో ఉందని ఆయన తెలిపారు. అయితే చూడాలి మరి ఇది ఇలా ఎక్కడి వరకు వెళ్తుంది అనేది.

Related posts