telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

హైదరాబాద్‌ లో సోమవారం తాగునీటి సరఫరా నిలిపివేత!

municipal tap without permission causes criminal case

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాలకు సోమవారం నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. గుర్రంగూడ క్రాస్‌రోడ్డు వద్ద కృష్ణా తాగునీటి సరఫరా రెండోదశ పైపులైన్‌కు మరమ్మతుల కారణంగా తాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 15న ఉదయం 6 గంటల నుంచి 16వ తేదీ ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

వైశాలినగర్‌, బీఎన్‌రెడ్డినగర్‌, ఆటోనగర్‌, వనస్థలిపురం, మీర్‌పేట్‌, బాలాపూర్‌, మైసారం, బర్కాస్‌, తెల్లగుట్ట, రామాంతాపూర్‌, ఉప్పల్‌, హబ్సిగూడ, నాచారం, చిలుకానగర్‌, తార్నాక, లాలాపేట్‌, బౌద్ధనగర్‌, మారేడ్‌పల్లి, కంట్రోల్‌రూం, మేకలమండి, బోలక్‌పూర్‌, హంసత్‌పేట రైల్వేస్‌, ఎంఈసీ, కంటోన్మెంట్‌, ప్రకాశ్‌నగర్‌, పాటిగడ్డ ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు చెప్పారు.

Related posts