telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పారదర్శక పాలన అందించేందుకు జగన్ కృషి

ఏపీ సీఎం జగన్‌ రాష్ట్రంలో పారదర్శక పాలన అందించేందుకు కృషి చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. టెండర్లలో అవినీతికి ఆస్కారం లేకుండా సిట్టింగ్‌ హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటు సాహసోపేత నిర్ణయం అని ట్విటర్ లో పేర్కొన్నారు.

కొన్ని సందర్భాల్లో విశ్రాంత జడ్జిలతో విచారణ చేయించడం చూశాం. జగన్‌ గారి పాలన ఎంత పారదర్శకంగా ఉండబోతోందో చిన్న ఉదహరణ ఇది అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. హైకోర్టు తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌ను సీఎం జగన్‌ మంగళవారం కలిసి సుమారు 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఈ భేటీలో పలు కీలక అంశాలను ముఖ్యమంత్రి చీఫ్‌ జస్టీస్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

Related posts