telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

వరల్డ్ కప్ నుంచి విజయ్ శంకర్ అవుట్… అతని స్థానంలో…

Vijay-Shankar

క్రికెట్ అభిమానులకు వరల్డ్ కప్ ఫీవర్ పట్టుకుంది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ వరల్డ్ కప్ గురించే మాట్లాడుకుంటున్నారు. గాయాల కారణంగా కొంతమంది క్రికెటర్లు ఈ వరల్డ్ కప్ కు దూరమవుతుంటే… కొంతమంది ఆటగాళ్లకు మాత్రం ఊహించని విధంగా స్థానం దక్కుతోంది. తాజాగా బొటన వేలికి గాయం కావడం కారణంగా వరల్డ్ కప్ నుంచి విజయ్ శంకర్ నిష్క్రమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్‌లోని తదుపరి మ్యాచ్‌లకు గానూ విజయ్ శంకర్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను టీమిండియా జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మయాంక్ అగర్వాల్ గత సంవత్సరం ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌తో టెస్ట్ మ్యాచ్‌ల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఊహించని విధంగా అతనికి వరల్డ్ కప్‌లో చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే గాయం కారణంగా శిఖర్ ధావన్ ప్రపంచ కప్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అగర్వాల్ పేరును ఐసీసీ టోర్నమెంట్ టెక్నికల్ కమిటీ ఇప్పటికే ఆమోదించినట్లు తెలిసింది.

Related posts