telugu navyamedia
news telugu cinema news trending

బాక్స్ ఆఫీస్ వద్ద.. మోతమోగిస్తున్న .. గద్దలకొండ గణేష్ ..

varuntej movie successful collections on

గద్దలకొండ గణేష్ గా వరుణ్ తేజ్ నటించి మెప్పిస్తున్నారు. ఈ సినిమాకి మొదటి రోజే మంచి టాక్ రావడంతో సూపర్ ఓపెనింగ్స్ సాధించింది. వరుణ్ తేజ్ హీరోగా గద్దలకొండ గణేష్ సినిమాకి హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం మొదటిరోజే 6.7 కోట్ల షేర్ వసూలు చేసింది. రెండో రోజు కూడా అదిరిపోయే కలెక్షన్స్ సాధించి కమర్షియల్‌గా ఒక పెద్ద హిట్‌గా నిలిచేలా చేస్తుదని అనిపిస్తుంది. క్లాస్ హీరోగా పేరుఉన్న వరుణ్‌ తేజ్‌ని వైలెంట్ విలన్‌గా పరిచయం చేస్తూ ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ చిత్రీకించిన సినిమా గద్దలకొండ గణేష్ (గతంలో వాల్మీకి). ఈ సినిమాపై ముందు నుండే అందరికి ఒక మంచి అభిప్రాయం ఉంది. హరీష్ శంకర్ కనీసం రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా కసిగా హిట్ కొట్టాలని తీసిన సినిమా ఇది. వరుణ్ తేజ్ బ్యాడ్‌బాయ్ క్యారెక్టరైజేషన్ అందరికి కనెక్ట్ అవ్వడంతో గద్దలకొండ గణేష్ బాక్స్ ఆఫీస్ దగ్గర నిలిచాడు.

మొదటి రోజు ఈ ఏడాది బిగ్ హిట్స్‌లో ఒకటయిన F2 కలెక్షన్స్‌ని కూడా దాటేసిన గద్దలకొండ గణేష్. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు ఏకంగా 5 కోట్ల 50 లక్షలు వసూళ్లు సాధించి అందరిని అక్ష్యపరిచింది. గద్దలకొండ గణేష్ రెండో రోజు కూడా 3.45 కోట్లు వాసులు చేసుకుంది. దీంతో రెండు రోజులకు గాను 9 కోట్ల మార్క్ టచ్ ఇచ్చింది. ఇక మూడో రోజు కూడా ఆశించిన కలెక్షన్స్ వస్తే మాత్రం గద్దలకొండ గణేష్ సినిమా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్‌కి నిలుస్తుంది. ఏరియాల వారీగా రెండు రోజుల కలెక్షన్స్ నైజాం 3.04 కోట్లు, ఉత్తరాంధ్ర 1.16 కోట్లు, సీడెడ్ 1.40కోట్లు, నెల్లూరు 0.38 కోట్లు, గుంటూరు 0.94 కోట్లు, ఈస్ట్0.70 కోట్లు, వెస్ట్ 0.75 కోట్లు,కృష్ణా -0.69 కోట్లు రికార్డులో నిలిచింది గద్దలకొండ గణేష్ సినిమా.

Related posts

మెక్ డొనాల్డ్స్ చికెన్ వింగ్స్ లో కోడి ఈకలు

vimala p

గురువుకు మంత్రి జగదీష్ రెడ్డి పాదాభివందనం

vimala p

తెలుగు రాష్ట్రాలలో .. ఘనంగా వికారి నామ సంవత్సర వేడుకలు ..

vimala p