telugu navyamedia
రాజకీయ

హూజూరాబాద్‌లో ఉద్రిక్త‌త‌.. జెండాలు పాతుతాం..!

హూజూరాబాద్‌లో ఉద్రిక్త‌త‌.. జెండాలు పాతుతాం..!

హూజూరాబాద్‌లో అంబేద్క‌ర్ కూడ‌లిలో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది. బీజేపీ, టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లు ఒక‌రికొక‌రు తోసుకోవ‌డంతో ఘ‌ర్ష‌ణ మొద‌లైంది. ద‌ళితుల‌ను కించ‌ప‌రిచేలా వ్యాఖ్య‌లు చేశారంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతుండంతో అదే విష‌యంపై రెండు వ‌ర్గాలు కార్య‌కర్త‌లు గొడ‌వ‌కు దిగారు.

కాగా అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పాలాభిషేకం చేశారు. అదే స‌మ‌యంలో టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు అక్క‌డ‌కు రావ‌డంతో ఇరువురి మ‌ద్య తోపులాటలు, నినాదాల‌తో ఆప్రాంతం మారుమ్రోగింది. దీంతో అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు ఇరు వ‌ర్గీల‌ను అక్క‌డ‌నుంచి పంపించేశారు.

అంతేకాగా..మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేంద్ర‌ర్ బావ‌మ‌రిది ద‌ళితుల‌పై చేసిన వాఖ్య‌లకు ఈటేల ముక్కు నేల‌కు రాసి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని మోత్కుప‌ల్లి న‌ర్సింహులు కొరారు. 40 ఎక‌రాల ఎసైన్డ్ భూములు లాక్కున్న ఈటెల‌కు పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌ని హెచ్చ‌రించారు. ప్యూడ‌ల్ మ‌న‌స్త‌త్వం ఉన్న ఈటెల‌ను ప్ర‌జ‌లు న‌మ్మోద్దు అని, హూజారాబాద్‌లో నుంచి బ‌హిష్క‌రించాల‌ని పిలుపునిచ్చారు.

ఈటెల ఆక్ర‌మించిన భూముల్లో జెండాలు పాతుతామ‌ని, రాష్ట్ర‌వాప్తంగా ప‌ర్య‌టించి ద‌ళిత బంధుకు మ‌ద్ద‌తు గా ప్ర‌చారం చేస్తాన‌న్నారు. ఇప్ప‌టికైనా ద‌ళితుల భూములు వెన‌క్కి ఇవ్వాల‌ని కోరారు.

Related posts