telugu navyamedia
sports trending

పాండ్య పై .. ఆగని ట్రోలింగ్.. ‘.. ఆజ్ కర్‌కే ఆయా క్యా’ అంటూ మహిళా హాల్ చల్…

trolling on pandya not yet stopeed

నోరుమంచిదైతే ఊరు మంచిది అంటారు పెద్దలు. అందుకే కాలుజారినా మళ్ళీ నిలదొక్కుకోవచ్చు, నోరు జారితే ఇక అంతే. మన పాండ్య పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆజ్ కర్‌కే ఆయా.. అన్నాడు, దొరికిపోయాడు. అన్నది తప్పని తెలిసి, క్షమాపణ చెప్పాడు, అయినా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. మొన్న జరిగిన మ్యాచ్ లో ఓ మహిళ చూపించిన ప్లకార్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

‘కాఫీ విత్ కరణ్’ షోలో పాండ్యా మాట్లాడుతూ ‘నేను ఈ రోజు చేసే వచ్చాను’ (మై కర్‌కే ఆయా) వ్యాఖ్యలను గుర్తుకు తెచ్చేలా ‘పాండ్యా ఆజ్ కర్‌కే ఆయా క్యా’ (పాండ్యా.. ఈ రోజు కూడా చేసే వచ్చావా?) అని ప్లకార్డు ప్రదర్శించింది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ ప్లకార్డుపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను మైదానంలోనే ట్రోల్ చేసిందో అమ్మాయి. ‘కాఫీ విత్ కరణ్’ టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి నిషేధానికి గురైన పాండ్యా ఇటీవలే తిరిగి జట్టులోకి వచ్చాడు. మహిళలపై అసభ్యకరంగా మాట్లాడి విమర్శలు కొనితెచ్చుకున్న పాండ్యా ఆ తర్వాత క్షమాపణలు చెప్పినప్పటికీ నెటిజన్లు మాత్రం అతడి వ్యాఖ్యలను మర్చిపోలేకపోతున్నారు.

Related posts

రైతుల వద్దకే .. ఏటీఎం లు..

vimala p

అన్నివిధాలా ఏపీకి తోడుగానే ఉంటాం .. మోడీ హామీ..

vimala p

కేసీఆర్ కు… సినీ తారల శుభాకాంక్షల వెల్లువ…

vimala p