సినిమా పరిశ్రమలోకి చాలా మంది ప్రకటనల ద్వారానే వస్తుంటారు. వారు చేసిన ప్రకటనలు చూసి, అది నచ్చిన దర్శకుడు అవకాశం ఇస్తుంటారు. కొందరు అనుకోకుండా కూడా సినిమా పరిశ్రమలోకి వస్తున్న సందర్భాలు కూడా లేకపోలేదు. కానీ ఎక్కువ మంది మాత్రం యాడ్స్ ద్వారానే వస్తున్నారు. అలా వచ్చిన వారిలో శ్రీయా కూడా ఉంది. అయితే ఆ యాడ్స్ నిజం కాదని, అప్పటిలో తనకు అవన్నీ తెలియనిస్థితిలో చేశానని ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పుడైతే మాత్రం యాడ్స్ చేయబోవడం లేదని స్పష్టంగా చెప్పేసింది. సినిమా రంగంలో ఏదో ఒక పాత్రలో ప్రేక్షకులను మెప్పిస్తాను కానీ, యాడ్స్ మాత్రం ససేమిరా అంటుంది. అంతగా బాధించే విషయం ఏమి జరిగిందో..యాడ్స్ అంటేనే చిరాకు పడుతుంది.
‘ఆ కంపెనీ క్రీమ్ వాడకుంటే పెళ్లి కాదా?’ అంటోంది మూడున్నర పదుల వయసు దాటినా ఇంకా కుర్రకారు మదిలో తిష్టేసుకుని కూర్చున్న శ్రియ. ఇటీవలి కాలంలో ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ వ్యాపార ప్రకటనపై స్పందించిన ఆమె, తాను ఆది నుంచి కొన్ని రకాల వాణిజ్య ప్రకటనలకు వ్యతిరేకినని, ఫెయిర్ నెస్ క్రీమ్ వాడితే తెల్లగా అవుతారని, వారికి తొందరగా పెళ్లి అవుతుందని ఆ మధ్య వచ్చిన ఓ ప్రకటన తనకు నచ్చలేదని తెలిపింది. “సదరు క్రీమ్ వాడితేనే అమ్మాయిలకు పెళ్ళవుతుందా? లేకపోతే కాదా? తెల్లగా ఉండాలన్నది చర్మ సౌందర్యానికి సంబంధించిన విషయం. అది స్వతహాగానే వస్తుంది తప్ప ఏ క్రీమ్ లు వాడినా రాదు. ఈ తరహా అసత్యపు యాడ్స్ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడం నాకు నచ్చదు. అందుకే పలు ప్రకటనలకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తానన్నా నేను ఒప్పుకోను” అని ఆమె వ్యాఖ్యానించింది.