telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పెళ్ళికి టైమ్ తీసుకోవాలనుకుంటున్న నితిన్ ?

Nithin

ఓ వైపు లాక్‌ డౌన్‌ కొనసాగుతున్నా నిబంధనలు పాటిస్తూ అతి తక్కువ మంది సమక్షంలో యంగ్ హీరో నిఖిల్‌ సిద్దార్థ్‌ పెళ్లి చేసుకున్నాడు. మరోవైపు ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు కూడా లాక్‌డౌన్‌లో రెండో వివాహం చేసుకున్నారు. ఇక యంగ్ హీరో నితిన్‌ కూడా ఇదే పద్దతిని ఫాలో అవుతాడని అంతా అనుకున్నారు. కానీ నితిన్‌ తన పెళ్లిని సింఫుల్‌గా చేసుకునేందుకు రెడీగా లేడట. ప్రస్తుత పరిస్థితులు సద్దుమణిగే వరకూ పెళ్లికి టైం తీసుకోవాలని చూస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అవసరమైతే తన పెళ్లిని వచ్చే ఏడాదికి వాయిదా వేసుకోవాలని కూడా భావిస్తున్నాడట. ఇదిలా ఉంటే నితిన్‌, షాలిని కుటుంబాలు కొత్త పెళ్లి తేదీని ఇప్పటివరకు ప్రకటించలేదు. మరి ఇరుకుటుంబాలు నితిన్‌, షాలిని పెళ్లిపై ఏం నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి.

Related posts