telugu navyamedia
సినిమా వార్తలు

తెలుగు విలన్ సిక్స్ ప్యాక్.. పిక్ వైరల్

Ajay

బాలీవుడ్‌లో హీరో, విలన్ అనే తేడా లేకుండా సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నిస్తుంటారు. ఇక టాలీవుడ్‌ లో మాత్రం హీరోలే ఎక్కువగా సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ పాత్రలతో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న అజయ్ కొత్త ట్రెండ్‌‌ ను సెట్ చేస్తున్నారు. తాజాగా ఆయన సిక్స్ ప్యాక్‌తో ఉన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అజయ్ ప్రస్తుతం హీరోగా, విలన్‌గా బిజీబిజీగా ఉన్నాడు. అయితే అజయ్ ఏ సినిమా కోసం ఈ సిక్స్ ప్యాక్ చేస్తున్నాడో తెలియదు కానీ సిక్స్ ప్యాక్‌తో దర్శనమిచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. టాలీవుడ్‌లో బాలీవుడ్ విలన్ల హవా కొనసాగుతున్న వేళ.. సిక్స్ ప్యాక్ తో దర్శనమిచ్చిన ఈ తెలుగు విలన్‌ ఇప్పుడు వారికి గట్టిపోటీ ఇవ్వడం ఖాయం అంటున్నారు నెటిజన్లు. ఆయన భార్య శ్వేత కూడా ఫిట్ నెస్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఫ్యాషన్ వరల్డ్ మోడల్ గా కూడా అజయ్ భార్య మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Related posts