telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మూడు పెళ్లిళ్లు అని అవమానిస్తే హ్యాపీగా ఉందా? అంతా ఆ సన్నాసి వల్లే… : పూనమ్ కౌర్

Poonam Kaur

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా తాను డిప్రెషన్ కి లోనవడానికి టాలీవుడ్ లో గుర్తింపు పొందిన ఓ స్టార్ డైరెక్టర్ కారకుడయ్యాడని వరుస ట్వీట్లతో చెప్పుకొచ్చింది. అయితే వీటిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. నెటిజన్స్ కి పూనమ్ ఇచ్చిన సమాధానాలు మరింతగా వైరల్ అవుతున్నాయి.అయితే ఈ ట్వీట్ కి రిప్లై ఇచ్చిన ఓ నెటిజన్ దీనిపై లీగల్గా పోరాడాలని సలహా ఇచ్చాడు. దీంతో పూనమ్ ఘాటుగా రియాక్ట్ అయింది. ”మీ అన్న చెప్పారా? ఆయన ఓడిపోతే హ్యాపీగా ఉందా? ఆయన ఇన్సల్ట్ అయింది మీకు హ్యాపీగా ఉందా..? చెప్పండి. మూడు పెళ్లిళ్లు అని అవమానిస్తుంటే హ్యాపీగా ఉందా? ఆ సన్నాసి వల్ల మీ అన్న జీవితం పాడైందని తెలియాలి.. నమస్తే” అంటూ సంచలన ట్వీట్ చేసింది.

Related posts