telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

మంచి దొంగ.. అయినా జైలు తప్పలేదు.. !

thief returned money stolen from women

దొంగ అన్నాక జాలి-దయ వంటివి లేకుండా, దొరికింది పట్టుకుపోతుంటారు. కానీ ఈ మంచి దొంగ కాస్త వేరుగా ప్రవర్తించాడు. అందుకే మంచి దొంగ అనిపించుకున్నాడు. ఇంతకీ జరిగింది ఏమంటే, తాను ఎప్పటిలాగానే దొంగతనం చేయడానికి వెళ్ళాడు. అయితే ఈ సారి ఒక ఎటిఎం దగ్గర మహిళ నగదు తీసుకుంటుండగా, ఆమె దగ్గరకు వెళ్లి ఆయుధం చూపించి, నగదు ఇవ్వాలని కోరాడు. ఆమె కూడా భయంతో ఉన్నది అంత ఇచ్చేసింది. అయితే అంతటితో ఆగకుండా, ఆ దొంగ ఒక్కసారి బ్యాంకు అకౌంట్ లో ఇంకా ఎంత డబ్బు ఉందొ చూపించాలన్నాడు..

చేసేది లేక ఆమె బాలన్స్ చెక్ చేసి చూపింది. అంతే, కరిగిపోయిన దొంగ, ఆమె దగ్గర తీసుకున్న నగదు అంతా ఇచ్చేసి, వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకలాగా, అంటే, ఆమె అకౌంట్ లో నగదు అసలు లేదట.. అది చూసి మనవడికి జాలి వేసి, మంచి దొంగ అనిపించేసుకున్నాడు. వచ్చిన చిక్కల్లా ఏంటంటే, ఈ జరిగిన ఘటన అంతా అక్కడ సీసీ కెమెరాలో నమోదు కావడంతో, అక్కడి పోలీసులు అతగాడిని ఖైదు చేశారట. ఏమంటే దొంగతనం తప్పే కదా.. అందుకే. అయితే తాను చేసిన పనిని వాళ్ళు కూడా మెచ్చుకున్నారట. మంచి దొంగే కదా.. తెలుగు సినిమాలలో మాదిరి.. !!

ఇదంతా జరిగింది చైనాలో, హేయువాన్‌ అనే నగరానికి చెందిన లీ అనే యువతి కి ఈ దొంగ ఎదురయ్యాడు. పోలీసులు కూడా ఆ దొంగ మంచితనాన్ని మెచ్చుకున్నారు. ఈ సీసీటీవీ ఫుటేజ్‌ సోషల్‌మీడియాలోకి రావడంతో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ‘ఇంత మంచి దొంగను శిక్షించడం ఎందుకు?’ అంటూ నెటిజన్లు అతనికి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.

Related posts