telugu navyamedia
సినిమా వార్తలు

కపిల్ దేవ్ గా ర‌ణ్‌వీర్ ఫస్ట్ లుక్

83

1983 వరల్డ్‌కప్ ఫైనల్లో అప్పటి డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించి తొలిసారి టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. దీని ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా “83”. చిత్రంలో క‌పిల్ దేవ్ పాత్ర‌ని ర‌ణ్‌వీర్ సింగ్ పోషిస్తుండ‌గా… దీపిక.. రోమి దేవ్ అనే పాత్ర‌లో ర‌ణ్‌వీర్‌కి భార్య‌గా కనిపించ‌నుంది. చిత్రంలో క్రికెటర్ కృష్ణ‌మాచారి శ్రీకాంత్ పాత్ర‌లో త‌మిళ న‌టుడు జీవా న‌టిస్తున్నాడు. నవాజుద్దీన్ సిద్దిఖీ ..రణ్ వీర్ సింగ్‌కి కోచ్ గా నటించనున్నారు. పంక‌జ్ త్రిపాఠి, తాహిర్ ఆజ్ భాసిన్‌, స‌కీబ్ స‌లీమ్, చిరాగ్ ప‌టిల్‌, అదినాథ్ కొఠారే, ధైర్య క‌ర్వా, దిన‌క‌ర్ శ‌ర్మ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. మ‌ధు మంతెన‌, విష్ణు ఇందూరి, ఖాన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ లండన్‌లో జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది. తాజాగా ఈ చిత్రంలో రణ్ వీర్ ఫస్ట్ లుక్ ను విడుద‌ల చేశారు. క‌పిల్ దేవ్‌గా ర‌ణ్‌వీర్ లుక్ పై నెటిజ‌న్స్ నుండి ప్ర‌శంసల వర్షం కురుస్తోంది. 2020 ఏప్రిల్ 10న‌ గుడ్ ఫ్రైడే రోజు క‌పిల్ దేవ్ బ‌యోపిక్ ని హిందీ, తెలుగుతో పాటు పలు భాషలలో విడుద‌ల చేయ‌నున్నారు.

Related posts